సినిమా ఇండస్ట్రీ లో ఒకే రోజు మంచి క్రేజ్ ఉన్న రెండు సినిమాలను నిర్మాతలు ఎక్కువ శాతం విడుదల చేయరు. ఎందుకు అంటే సినిమాలు బాగున్న కానీ ఒక సినిమా వల్ల మరో సినిమాపై ప్రభావం పడి ఏదైనా ఒక సినిమా కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంటుంది అనే నేపథ్యంలో కనీసం రెండు సినిమాల విడుదలకు మధ్య ఒక రోజు ఆయన గ్యాప్ ఉండేలా మేకర్స్ చూసుకుంటూ ఉంటారు. ఇకపోతే తాజాగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ "మేడ్ స్క్వేర్" అనే మూవీ ని నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మార్చి 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.

ఇక తాజాగా ఈ సినిమాను మార్చి 29 వ తేదీన కాకుండా మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలా విడుదల తేదీని మార్చడానికి గల కారణాలను కూడా ఈ సినిమా నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ చెప్పుకొచ్చాడు. డిస్ట్రిబ్యూటర్ల సలహా మేరకు అలాగే మార్చి 29 వ తేదీన అమావాస్య ఉండడంతో మార్చి 28 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకున్నట్లు సూర్య దేవర నాగ వంశీ చెప్పుకొచ్చాడు. ఇకపోతే మార్చి 28 వ తేదీన నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి సంస్థ వారు నిర్మించిన రాబిన్ హుడ్ సినిమాను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలు అయినటువంటి మైత్రి , సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించిన ఈ రెండు క్రేజీ సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. దానితో ఈ రెండు మూవీలలో ఏ సినిమాకి మంచి టాక్ వస్తుందా ... ఏ మూవీ మంచి కలెక్షన్లను వసూలు చేస్తుందా అనే ఆసక్తి చాలా మంది జనాల్లో పెరిగిపోయింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: