సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ శాతం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో విజయాలు దక్కిన వారికి మంచి క్రేజ్ రావడం , ఆ తర్వాత వారు చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్స్ స్థాయికి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంత మంది విషయం లో మాత్రం మొదట నటించిన సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర పెద్ద ప్రభావాలను చూపకపోయిన ఆ తర్వాత వారికి మంచి విజయాలు దక్కడం వల్ల వారు అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి మీనాక్షి చౌదరి ఒకరు.

ఈ ముద్దు గుమ్మ మోడలింగ్ రంగం నుండి సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఈమె మొదట గా తెలుగు లో సుశాంత్ హీరోగా రూపొందిన ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక మొదటి సినిమాతో అపజయాన్ని ఎదుర్కొన్న ఈ బ్యూటీ ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన కిలాడి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ఈమె మొదట గా నటించిన రెండు తెలుగు సినిమాలు కూడా ఫ్లాప్ కావడం తో ఈమె కెరియర్ క్లోజ్ అయినట్లే అని కొంత మంది భావించారు.

కానీ అలాంటి సమయంలోనే మీనాక్షి చౌదరి , అడవి శేషు హీరోగా రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోయిన్గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక అప్పటి నుండి ఈమె అచి తుచి సినిమాలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ వస్తుంది. దానితో ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తుంది. ఇక ప్రస్తుతం ఈమె చేతులో అనేక క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: