టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లైన హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు వరుస ఆఫర్లను సొంతం చేసుకున్న హీరోయిన్లు ఇప్పుడు సరైన ఆఫర్లు లేక కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు వరుస ఆఫర్లతో కెరీర్ ను కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం సమంత చేతిలో ఒకింత పరిమితంగానే ఆఫర్లు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
 
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు గతేడాది డిసెంబర్ నెలలో పెళ్లి కాగా ఈ హీరోయిన్ కు సైతం ఆశించిన స్థాయిలో ఆఫర్లు అయితే రావడం లేదనే సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా పెళ్లి తర్వాత కెరీర్ పై ప్రభావం పడింది. ఈ బ్యూటీకి ఎక్కువ సంఖ్యలో మూవీ ఆఫర్లు అయితే గతంలోలా రావడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
మరో హీరోయిన్ కాజల్ పరిస్థితి సైతం ఆశాజనకంగా లేదు. ఈ హీరోయిన్ కు పెళ్లి తర్వాత అడపాదడపా ఆఫర్లు వచ్చినా ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు అయితే రావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టాలీవుడ్ హీరోయిన్లు ప్రస్తుతం ఒకింత వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
పెళ్లి తర్వాత హీరోయిన్లను వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపించడం లేదు. ఈ రీజన్ వల్లే హీరోయిన్ల పారితోషికాలు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ హీరోయిన్ల భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఈ హీరోయిన్లు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లకు ఇతర భాషల్లో సైతం ఆశించిన స్థాయిలో మూవీ ఆఫర్లు అయితే దక్కడం లేదని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో అయినా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: