మంచు మనోజ్ ఈ మధ్య కాలంలో సినిమాల కంటే వివాదాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మనోజ్ నటిస్తున్న పలు సినిమాలు థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతాయనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. ఈరోజు మంచు మనోజ్ మౌనికల పెళ్లిరోజు కాగా మౌనిక మనోజ్ కు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
ఇంత అందమైన కుటుంబాన్ని పొందినందుకు నేను కృతజ్ఞతలు చెబుతున్నానని ఆమె తెలిపారు. మనం మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నానని మౌనిక చెప్పుకొచ్చారు. పెళ్లిరోజు శుభాకాంక్షలు మనోజ్,, దడదడలాడిద్దాం అంటూ ఆమె పేర్కొన్నారు. ధైరవ్ ను మౌనిక, పాపను మనోజ్ ఎత్తుకున్న ఫోటోను సైతం ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.
 
ఈ పోస్ట్ గురించి మంచు లక్ష్మి రియాక్ట్ అవుతూ నీ పోస్ట్ భలే బాగుందని మీ నలుగురినీ ఎంతో ప్రేమిస్తున్నానని ఎప్పుడూ సంతోషంగా ప్రేమగా ఇలాగే కలిసుండాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మంచు ఫ్యామిలీ కలకాలం కలిసి ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
 
మంచు కుటుంబంలో ఏవైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తినా వాటిని పరిష్కరించుకుని ఆనందంగా జీవనం సాగించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మంచు ఫ్యామిలీ హీరోలకు రాబోయే రోజుల్లో భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మంచు కుటుంబంలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయేమో చూడాల్సి ఉంది. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఆస్తులకు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఆ సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయో చూడాల్సి ఉంది. మంచు లక్ష్మి సైతం ఈ వివాదం విషయంలో ఒకింత మౌనంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.




 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: