టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలు సాధించిన పూజా హెగ్డే ప్రస్తుతం సరైన ఆఫర్లు లేక కెరీర్ విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పూజా హెగ్డే పారితోషకం సైతం పరిమితంగా ఉందనే సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రం ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీకి ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు రావడం లేదు. అయితే నాగార్జునకు జోడిగా ఈ బ్యూటీ ఒక సినిమాలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.
 
నాగార్జున ప్రస్తుతం కుబేర సినిమాతో పాటు కూలీ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని ఆ సాంగ్లో నాగార్జునకు జోడిగా పూజ హెగ్డే కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
 
వైరల్ అవుతున్న వార్త నిజమైతే మాత్రం పూజా హెగ్డే ఖాతాలో అరుదైన రికార్డు చేరే అవకాశం అయితే ఉంది. పూజా హెగ్డే ఇప్పటికే నాగచైతన్య అఖిల్ లకు జోడిగా నటించడంతోపాటు ఆ సినిమాలతో విజయాలను అందుకున్నారు. నాగార్జునకు కూడా జోడిగా పూజ హెగ్డే నటిస్తే మాత్రం ఒకింత సంచలనం అవుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు స్టార్ హీరోలకు జోడిగా నటించడం సాధారణ రికార్డ్ కాదు. త్వరలో అధికారికంగా పూజ హెగ్డే వైపు నుంచి కూడా ఇందుకు సంబంధించిన సందేహాలకు చెక్ పడే అవకాశాలు ఉన్నాయి.
 
పూజా హెగ్డే తెలుగు సినిమాలతో పోలిస్తే తమిళ సినిమాలలో ఎక్కువగా ఆఫర్లను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. వరుస ఫ్లాపులు, కొత్త హీరోయిన్ల ఎంట్రీ పూజా హెగ్డే కు మైనస్ అయ్యాయి. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం పూజా హెగ్డే చాలా లక్కీ అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా ఎవరికి సాటిరాని స్థాయిలో పూజా హెగ్డే ఉన్నారు. ఇతర హీరోయిన్లకు భిన్నంగా ఈ బ్యూటీ అడుగులు వేస్తున్నారు.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: