
ఆ ఫ్రాంచైజీ ఏదో కాదు రేస్ -4.. హీరోగా నుండి విలన్ గా టర్నింగ్ తీసుకున్న సైఫ్ అలీ ఖాన్ ఇందులో నటిస్తూ ఉన్నారట. ఇందుకు సంబంధించి త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు కాబోతోందని.. అలాగే మరొక హీరో సిద్ధార్థ మల్హోత్రా ఇందులో ఎంట్రీ అవ్వబోతున్నారట. అయితే వీరందరికీ జోడీగా హీరోయిన్లు ఎవరనే విషయం పైన ఇప్పుడు పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. శార్వరి , మాజీ మిస్ వరల్డ్ మనుషి చిల్లర్ కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే వీరితోపాటు హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ పేరు కూడా వినిపించడం గమనార్హం. ఆల్మోస్ట్ హీరోయిన్స్ అందరూ కూడా ఫిక్స్ అయ్యారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
ఇటీవలే రకుల్ ప్రీతిసింగ్ మేరీ హస్బెండ్ కి బీవీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే కాకుండా రకుల్ ప్రీతిసింగ్ చేతులో మరొక రెండు ప్రాజెక్టులు కూడా ఉన్నాయట. అందులో భారతీయుడు 3, దేదే ప్యార్ దే 2 వంటివి ఉన్నాయి. వీటికి తోడు ఈ ఫ్రాంచైజిలో అవకాశం రావడంతో మరి ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో ఈ సినిమాలు ఏవిధంగా కలిసి వస్తాయో అని అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం పూర్తిగానే దూరమైనట్టుగా కనిపిస్తోంది రకుల్ మరి బాలీవుడ్ లో ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.