యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లైనప్ మాత్రం అదిరిపోయింది అని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఈ ఏడాది వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న తారక్ రాబోయే రోజుల్లో ప్రశాంత్ నీల్ సినిమాతో అభిమానులకు ఒకింత ఆనందాన్ని కలిగించనున్నారు. ఎన్టీఆర్ నెల్సన్ కాంబోలో సైతం ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తారక్ నెంబర్ వన్ హీరోగా నిలవాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
 
తారక్ నటిస్తున్న, నటించిన పలు సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 70 నుంచి 90 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముందుకు వస్తే బాగుంటుందని ఎన్నో ప్రశ్నలకు తారక్ సమాధానం ఇవ్వాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలయ్యకు సైతం దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేస్తుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. బాలయ్య, ఎన్టీఆర్ లకు ప్రస్తుతం వరుస విజయాలు దక్కుతున్నాయనే సంగతి తెలిసిందే.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సీక్వెల్ గురించి కూడా త్వరలో క్రేజీ అప్ డేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. ఎన్టీఆర్ దేవరతో బాక్సాఫీస్ వద్ద కొన్ని రికార్డులు క్రియేట్ చేయగా దేవర సీక్వెల్ తో అంతకు మించిన రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. మరో ఐదేళ్ల వరకు తారక్ డేట్లు లేనట్టేనని సమాచారం అందుతుండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: