ఎప్పుడూ తన సినిమాలతో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యే రాజమౌళి ఇప్పుడు మాత్రం ఊహించని వివాదాలతో ట్రెండ్ అవుతున్నాడు .. నేను రాజమౌళి ఫ్రెండ్ అని 34 సంవత్సరాలుగా మా మధ్య మంచి స్నేహం ఉంది .. నన్ను రాజమౌళి టార్చర్ చేస్తున్నాడు అంటు శ్రీనివాసరావు అనే వ్యక్తి విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది . అయితే అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ వీడియోను మాత్రం తెగ వైరల్ చేశారు .. తాను రాజమౌళి ఒకే అమ్మాయిని ప్రేమించామని ఆ విషయం బయట పడుతుందని తనపై ఒత్తిడి చేస్తున్నాడని .. గత కొన్ని సంవత్సరాలుగా టార్చర్ పెడుతున్నాడని ఆరోపిస్తూ ఒక వీడియో విడుదల చేశాడు ..


అయితే ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం అతను రాజమౌళి స్నేహితుడే అయినా .. అతను చెబుతున్న మాటల్లో ఆస‌లు నిజం ఉందో లేదో తెలీదు అంటున్నారు .. అలాగే ఈ వివాదం పై రాజమౌళి కచ్చితంగా సమాధానం ఇస్తాడని కూడా అంటున్నారు .. అందరూ అనుకున్నట్టుగానే ఓ వీడియో రిలీజ్ చేశాడు .. కానీ అది వివాదం మీద కాదు వేరే ఇష్యూ మీద. తన పెద్దన్నయ్య ఎంఎం కీరవాణి లైఫ్ కాన్సెప్ట్ గురించి చెబుతూ వీడియోను రిలీజ్ చేశాడు రాజమౌళి .. మార్చ్ 22న జరగబోయే ఈవెంట్లో కీరవాణి తన సంగీత ప్రయాణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వీడియోలో రాజమౌళి చెప్పుకొచ్చాడు . అలాగే ఈ కార్యక్రమంలో తన సినిమా పాటలతో పాటు , కీరవాణి కంపోజ్ చేసిన ఎన్నో పాటలు కూడా పాట బోతున్నారట .. అంతే కాకుండా ఈ లైఫ్ కన్సర్ట్ లో తాను కూడా పాల్గొన్న బోతున్నట్లు రాజమౌళి చెప్పాడు. . ఈ విధంగా వివాదం మీద‌ కాకుండా ఎంతో తెలివిగా మరో విషయం మీద‌ వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు జక్కన్న.



మరింత సమాచారం తెలుసుకోండి: