మన తెలుగులో ఉన్న స్టార్ హీరోస్ లో నాని - విజయ్ దేవరకొండ మధ్య ఏదో జరుగుతుంది .. రౌడీ హీరోని కావాలనే నాని తొక్కేస్తున్నాడా .. విజయ్ కెరియర్ నాశనం చేయడానికి ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి మరి సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడా ? ఇలా సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులగా బాగా జరుగుతున్న ప్రచారం ఇది .. దీంట్లో నిజ , నిజాలు ఏంటో తెలియదు కానీ నాని - విజయ్ దేవరకొండ మధ్య నిజంగానే ఏదో పెద్ద గొడవ జరుగుతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది . అయితే ఉన్నట్టుండి ఈ ప్రచారం ఎందుకు ఇప్పుడు తెరమీదకు వచ్చింది అనుకోవచ్చు . దానికి కూడా ఒక ఫేమస్ యూట్యూబర్ కారణం.
 

తోలిరోజు సినిమా చూసి అది బాలేదు అని చెప్పటమే ఆయనకు తెలిసిన పని .. ఆ సినిమా ఎలా ఉన్నా కూడా దాన్ని చీల్చి చెండాడి నెగటివ్గా చెప్పటమే ఆయనకు తెలిసిన వర్క్ .. ఈ యూట్యూబర్ కనిపిస్తే ఓ రేంజ్ లో నెగిటివ్ కామెంట్స్ వస్తాయి .. ఇక ఇప్పుడు నాని - విజయ్ దేవరకొండ మధ్య కూడా ఏదో నడుస్తుందంటూ ఆయన పెట్టిన రచ్చ ఇప్పుడు ఊహించని రేంజ్ కు వెళ్ళింది .. ఒకడు సడన్గా వచ్చి బాగా పైకి వెళ్ళాడు .. ఇంకొకడు మంచోడు మంచోడు అంటూ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్నాడు .. తనకంటే తర్వాత వచ్చిన వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు అంటే ఇప్పుడు ఈ మంచోడు డబ్బులు పెట్టి మ‌రి అంతలా అతన్ని ముంచే పనిలో ఉన్నాడా అంటూ ఆ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారాయి . ఆసుల నానికి విజయ్ దేవరకొండను తొక్కాల్సిన పనిలేదు .. ఇద్దరు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు .. స్టార్స్‌ అయ్యారు .. బ్యాక్ గ్రౌండ్ లేకుండా పెద్ద‌ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నారు .. ఇలాంటి సమయంలో నాని ఎందుకు విజయ్ కెరియర్ నాశనం చేయాలని చూస్తాడ..

 

అలాగే విజయ్ కెరియర్ ఎదగడానికి సహాయపడింది కూడా నానినే .  లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన తర్వాత విజయ్ దేవరకొండ అనే అతను ఒకడు ఉన్నాడని విషయం కూడా పెద్దగా ఎవరికీ తెలియదు .. అలాంటిది ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ముఖ్యపాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేశాడో నాని .. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాకు కూడా నాని తన వంతు హెల్ప్ చేశాడు .. అలా అక్కడ నుంచి విజయ్ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా నాని సహాయం చేస్తూనే ఉన్నాడు .. విజయ్ కూడా నాని మీద అంతే కృతజ్ఞత భావం చూపిస్తున్నాడు .  అలాంటి ఇద్దరు హీరోల మధ్య కావాలనే పెంట పెట్టాడు ఆ యూట్యూబ్ అంటూ ఇప్పుడు అతన‌ను ఓ రేంజ్ లో ఇద్దరు హీరోలు అభిమానులు వేసుకుంటున్నారు .. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న హీరోల అభిమానుల మధ్య ఉన్న గొడవలు చాలు .. ఇలా లేనిపోనివి తెచ్చి కొత్త పెంట పెట్టకండి అంటూ అభిమానులు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: