న్యాచురల్ స్టార్ నాని గురించి పరిచయం అనవసరం. చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. స్టార్ హీరో నాని తన నటనతో అంచలంచెలుగా ఎదుగుతూ మంచి స్థాయిలో ఉన్నాడు. నాని మొదట డైరెక్టర్ అవ్వాలనే కలతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కొద్ది రోజులు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత సినిమాలో చిన్న చిన్న పాత్రలలో నటించి ఇప్పుడు టాప్ హీరోగా ఎదిగాడు. ఎంతో మంది మధ్య తరగతి కుటుంబాలకు ఆదర్శంగా నిలిచాడు. ఈయన అష్టచెమ్మ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యి.. ఆతర్వాత ఈగ, జెర్సీ, మిడిల్ క్లాస్ అబ్బాయి, శ్యామ్ సింగ్ రాయ్, కృష్ణ అర్జున యుద్ధం, పిల్ల జమీందార్, అలా మొదలైంది, హాయ్ నాన్న, దసరా సినిమాలతో ఫుల్ పాపులర్ అయిపోయాడు.

ప్రస్తుతం నాని 'ది ప్యారడైజ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ మూవీని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో దసరా సినిమా వచ్చింది. ఇక దీంతో ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో సోనాలి కులకర్ణి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎస్‌.ఎల్‌.వి సినిమాస్ పతాకంపై రూపొందుతుంది. ది ప్యారడైజ్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ప్రకటించలేదు.

అయితే తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో హీరో నాని మాస్ లుక్ లో కనిపించారు. ఇది చూసిన ప్రేక్షకులు ఈ సారి నాని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తారని అర్ధం అయింది. ఇక ఈ సినిమాలో నాని లుక్ ని చూసిన అభిమానులకు సినిమాపై ఆసక్తి పెరిగింది. నాని యాక్షన్ రోల్ లో రాబోయే ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనుందని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: