జూనియర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ మంచి జోరు మీద ఉన్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ను ప్రారంభించారు. ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఏదో ఒక అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం బయటికి రాదు. ఇదిలా ఉండగా.... ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 31 సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారట. ఈ సినిమాను 500 కోట్ల రూపాయలతో తీస్తున్నారని సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ సినిమా పూర్తయ్యే లోపు ఈ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాకు రవిశంకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నటిస్తున్న "డ్రాగన్" సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుందని తాజాగా ప్రొడ్యూసర్ రవిశంకర్ వెల్లడించారు. "రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్" సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన మీడియా ముందు మాట్లాడారు. అది వేరే లెవెల్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని రవిశంకర్ అన్నారు. ఇండియన్ స్క్రీన్ లలో ఇప్పటివరకు చూడని స్క్రిప్ట్ అని చెప్పారు.

మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ కలెక్షన్లను రాబట్టేలా ఉందని రవిశంకర్ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. రవిశంకర్ మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారని రవిశంకర్ అన్నారు. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: