ఇక 2025 లో సంక్రాంతి సీజన్ , ఫిబ్రవరి సీజన్ కూడా కంప్లీట్ అయింది .. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ముందు మార్చి నెలలో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉండరు .. ఎందుకంటే సినిమాల వరకు ఇది బాడ్ సీజన్ . పరీక్షలు మొదలయిపోతాయి యువ‌త‌రం అంతా ఈ హడావుడిలో ఉంటారు .. సంక్రాంతి , వేస‌వి సీజన్ మధ్య కాస్త గ్యాప్ ఉంటుంది .. అయితే ఈసారి మాత్రం సినిమాలు జోరుగానే రాబోతున్నాయి .. పెద్ద సినిమాల అలికిడి లేదు కానీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు వినోదాల‌కు ఢోకా లేదు . ఇక ఈవారం కూడా ఏడు సినిమాలు రిలీజ్ ఒక రెడీగా ఉన్నాయి .. అయితే వాటిలో ప్రేక్షకుల దృష్టిని తమ వైపు తిప్పుకుంటున్న సినిమా మాత్రం ఏదీ కనిపించడం లేదు .. కేవలం మౌత్ టాక్ తోనే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాల్సిన పరిస్థితి.

అయితే ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో కింగ్ స్టోన్ ఒకటి జీవి ప్రకాష్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది .. సముద్ర ప్రయాణంలో జాంబీలో ఎదురైతే ఎలా ఉంటుందన్నది సినిమా స్టోరీ .. చూడ్డానికి కొత్తగా ఉన్న ట్రైలర్లు విజువల్స్ బాగున్నాయి . జీవికి తెలుగులో అంతగా మార్కెట్ లేదు .. అయితే జాంబీల సినిమా కాబట్టి కలెక్షన్ కాస్త మంచిగా వచ్చే అవకాశం ఉంది .. అలాగే బాలీవుడ్లో సంచలన విషయం సాధించిన చావా ఈవారం తెలుగులో డబ్బింగ్ రూపంలో రిలీజ్ కాబోతుంది .. ఈ సినిమాను తెలుగులో చూడాలనుకున్న వారికి ఇది ఎంతో మంచి అవకాశం .. పైగా గీతా ఆర్ట్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది .. పబ్లిసిటీ పరంగా కూడా డోకా లేదు .. కాకపోతే ఇప్పటికీ ఈ సినిమాని హిందీ వర్షన్ లో చూసేసారు కలెక్షన్లు ఏం మాత్రం రాబడుతుంది అనేది చూడాలి.

ఈ సినిమాలతో పాటు ఈ వారం రాక్షస, నారి, రారాజు, శివంగి, పౌరుషం .. ఇలా చిన్న సినిమాలన్నీ విడుదల కాబోతున్నాయి .. అలాగే వెంకటేష్ , మహేష్ బాబు మల్టీస్టారస్ సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు కూడా రిలీజ్ కాబోతుంది .. దీంతో మహేష్ ఫ్యాన్స్ హంగామా మరోసారి థియేటర్లో చూసే వీలుంది . ఇలా ఈ మార్చి నెలలో చిన్న పెద్ద సినిమాలు మొత్తం 7 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో ఏ సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: