భాగ్యశ్రీ బోర్సే ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన నటన, అందం, అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. దర్శక, నిర్మాతలు సైతం భాగ్యశ్రీకి వరుసగా సినిమా అవకాశాలు ఇస్తున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా అనంతరం ఈ చిన్నదానికి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాన్ని అందుకుంటుంది.



రామ్ పోతినేని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సూర్య వంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ చిన్నదాని హవా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.... భాగ్య శ్రీకి ఏకంగా పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం స్పిరిట్. అయితే... ఆ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ తో  ప్రభాస్ సినిమా చేయబోతున్నాడట. వీరిద్దరి కాంబినేషన్లో మంచి... డిఫరెంట్ కథతో సినిమా వస్తోందట.


ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నట్లుగా జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ప్రభాస్ తో సినిమాలలో నటించే అవకాశం రాలేని హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. ఈ చిన్నది ఇలా వచ్చి రాగానే ప్రభాస్ సరసన హీరోయిన్ గా చేసే అవకాశాన్ని అందుకోవడంతో ప్రతి ఒక్కరూ ఈ చిన్నదానికి సినీ ఇండస్ట్రీలో అదృష్టం బాగా కలిసి వచ్చిందని అంటున్నారు.


ప్రభాస్ సరసన హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చిందంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఈ చిన్నదాని నటన ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా అనంతరం భాగ్యశ్రీ కి వరుసగా సినిమా అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: