తెలంగాణ సాంప్రదాయాన్ని బలగం సినిమాతో ప్రేక్షకులందరికీ తెలిసేలా చేశాడు దర్శకుడు వేణు. కమెడియన్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన వేణు బలగం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న వేణు ఎంతో గుర్తింపును పొందాడు. ప్రేక్షకుల ఆదరణను అందుకున్నాడు. ఈ సినిమా అనంతరం కొద్దిరోజుల గ్యాప్ తర్వాత వేణు తన తదుపరి సినిమాను తీయడానికి సిద్ధమయ్యారు. చాలా కాలం నుంచి ఈ సినిమా కథను పూర్తి చేసే పనిలో వేణు బిజీగా ఉన్నారు.


ఫైనల్ గా ఈ సినిమా కథ పూర్తయిన అనంతరం ఎల్లమ్మ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేసినట్లుగా వేణు చెప్పారు. ఈ సినిమాలో హీరోగా నేచురల్ స్టార్ నాని చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు నాని కాకుండా నితిన్ హీరోగా నటిస్తున్నారట. నితిన్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా చేయబోతోంది. సాయి పల్లవి ఎంతో సాంప్రదాయంగా అచ్చ తెలుగు అమ్మాయి వలె ఉంటుంది.


తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయలను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ల అందరిలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ సాయి పల్లవి బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.... ఎల్లమ్మ సినిమాలో సాయి పల్లవి మెయిన్ హీరోయిన్.


ఈ సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి అయితేనే అద్భుతంగా నటిస్తుందని దర్శకుడు వేణు భావించారట. అందుకోసమే సాయి పల్లవిని సంప్రదించి ఈ సినిమా కథ చెప్పిన వెంటనే సాయి పల్లవి ఓకే చేసిందట. ఇక ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతోందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి. ఈ సినిమా లో హీరోయిన్ లీడ్ రోల్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: