
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ రిలీజ్ డేట్లు ముందుగానే ఫిక్స్ అయ్యి ఉంటాయని తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాను ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో తెలుగులో డబ్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని బన్నీ వాస్ కామెంట్లు చేశారు. ఈ సినిమా గురించి పవన్ కు తెలిసే ఉంటుందని అనుకుంటున్నానని ఏ మాత్రం అవకాశం దొరికినా ఈ సినిమాను చూపించడానికి ప్రయత్నిస్తానని బన్నీ వాస్ వెల్లడించడం గమనార్హం.
బన్నీ పర్సనల్ ట్రైనింగ్ కోసం విదేశాలకు వెళ్లారని ఈరోజే ఆయన వచ్చారని త్వరలోనే బన్నీ కొత్త సినిమాలకు సంబంధించి టీమ్ నుంచి ప్రకటన వెలువడుతుందని బన్నీ వాస్ పేర్కొన్నారు. తండేల్ కు ఎంత లాభాలొచ్చాయనే ప్రశ్నకు బన్నీ వాస్ స్పందిస్తూ నాకు వచ్చే ఐటీ నోటీసులన్నీ మీరు కట్టేస్తానంటే నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్పేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ మధ్య కాలంలో యూనివర్సల్ టైటిల్ ఫిక్స్ చేస్తున్నారని ఛావా సినిమా విషయంలో సైతం మేము ఇదే ఫాలో అవుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ సినిమాను రీమేక్ చేసే ధైర్యం చేయలేనని రాబోయే రోజుల్లో రీమేక్ లనేవి ఉండకపోవచ్చని ఆయన అన్నారు. ఈ సినిమా వాయిస్ ఓవర్ కోసం తారక్ ను సంప్రదించలేదని డబ్బింగ్ లో నిపుణులైన వ్యక్తులతో ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పించామని ఆయన తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ అంచనాలకు మించి పెరుగుతున్న సంగతి తెలిసిందే.