ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన కరిష్మా కపూర్ ఎంతో మంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది. తన అందం, అభినయంతో నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె.. ఎన్నో హిట్ చిత్రాలలో చేసి తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకుంది.. అయితే కెరియర్ పీక్స్ లో ఉండగానే ఈమె వివాహం చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. అయితే ఈమె వైవాహిక జీవితం సజావుగా సాగలేదట.


భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. దీంతో కరిష్మా మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. గత ఏడాది మర్డర్ ముబారక్ అనే చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన మాజీ భర్త పైన పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. తన భర్త మొదటిలో చాలా బాగా ఉండేవారని కానీ రాను రాను అతనిలో క్రూరత్వం బయటికి వచ్చిందని తెలిపింది కరిష్మా కపూర్. అయితే ఈ విషయం అసలు ఊహించలేకపోయానని తెలియజేసింది.


అతను అంతకు దిగజారి పోతాడని తన కలలో కూడా అనుకోలేదని తెలిపింది కరిష్మా కపూర్. తన మాజీ భర్త తన స్నేహితుల వద్ద తనని వేలంపాట వేశారని ఎవరైతే అక్కడ ఎక్కువ డబ్బులు పోసి తనని కొంటారు ఆరోజు రాత్రి అంత వారితో గడపాలని చాలా బలవంతం చేశారని తెలియజేసింది కరిష్మా కపూర్. ఇలా తనని ఎన్నో పనులు చేసి చిత్రహింసలు చేసేవాడని వాటన్నిటిని భరించలేక తన మాజీ భర్తకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందంటూ తెలియజేసింది కరిష్మా కపూర్. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఈ విషయం తెలిసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతూ కరిష్మా కపూర్ ఇలాంటి వ్యాఖ్యలు చెప్పడం మొదటిసారి కాదని ఎన్నోసార్లు తెలిపింది అంటూ వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: