టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. మరికొంతమంది నటన అద్భుతంగా ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక హీరోయిన్ గా రాణించలేక పోతారు. అలాంటి వారిలో నటి ఐశ్వర్య రాజేష్ ఒకరు. 2019లో స్పోర్ట్స్ డ్రామా కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మంచి గుర్తింపు అందుకుంది.


సినిమా అనంతరం తెలుగులో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ పెద్దగా గుర్తింపు సొంతం చేసుకోలేకపోయింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. ఇక రీసెంట్ గా ఈ చిన్నది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కు భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించింది. అమాయకమైన నటన, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.


ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ నటనను చూసిన అనంతరం వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది తాజాగా తెలుగులో జరిగిన ఓ  షో పైన సంచలన వ్యాఖ్యలు చేసింది ఐశ్వర్య రాజేష్. ఆ షో యాజమాన్యం తనకు డబ్బులు ఎగగొట్టిందని బాంబు పేల్చింది  హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.


ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ... తాను అప్పట్లో ఒక షోకు వెళ్లానని తెలిపింది. ఆ సమయంలో తనకు 5 వేలు ఇస్తానని చెప్పి ఎగగొట్టారని వెల్లడించింది. ఆ షో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లెక్క కడితే...ఇంట్రెస్ట్ తో కలిపి ఐదు లక్షలు అవుతుందని  హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వెల్లడించారు. దీంతో ఆ షో ఎవరిది? ఎప్పుడు స్టార్ట్ అయింది  అనే దానిపైన చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: