
గతేడాది రిలీజ్ అయిన అనోరా మూవీ హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ఈ మూవీలో మైకీ మ్యాడిసన్, మార్క్ ఇడిల్‍స్టెయిన్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకు సీన్ బేకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రొమాంటిక్ కామోడీ డ్రామా చిత్రంగా తెరకెక్కించారు. ఈ మూవీ ఒక వేశ్వకు సంబంధించిన సినిమా. ఈ సినిమాను 6 మిలియన్ డాలర్ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు 41 మిలియన్ డాలర్ల కలెక్షన్ ని సొంతం చేసుకుంది. దీంతో పాటుగా అనోరా మూవీ ఐదు ఆస్కార్ అవార్డులను సాధించింది.
బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో ఈ సినిమా అవార్డులను కైవసం చేసుకుంది. ముఖ్యంగా మూవీ డైరెక్టర్ అయితే ఏకంగా నాలుగు ఆస్కార్ అవార్డులను అందుకున్నాడు. బెస్ట్ యాక్టర్ గా మైకీ మ్యూడిసన్ కూడా ఆస్కార్ అవార్డ్ ని అందుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతుంది.