
ఇప్పటికే నాని అలాగే శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో దసరా సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఈ ప్యారడైజ్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాను నిర్మాత సాహూ గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. అయితే ఇవాళ ఈ సినిమా నుంచి తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. ది ప్యారడైజ్ సినిమా గ్లిoమ్స్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో హీరో నాని యాక్టింగ్ అరాచకంగా ఉంది.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ.... శభాష్ రా నాని అంటూ కచ్చితంగా అనడం జరుగుతుంది. ఇందులో డైలాగులు ఏమీ లేవు కానీ.... నాని మాస్ యాక్టింగ్ కనిపించింది. అయితే ఈ సినిమా కు సంబంధించిన చిన్న వీడియో విడుదల కావడంపై.... సోషల్ మీడియాలో ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఇందులో వాడిన పదజాలం చాలా అసభ్యకరంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బూతు పదాలను సినిమాలలో ఎక్కించారని మండిపడుతున్నారు కొంతమంది. తల్లిని కిచపరిచేలా... ఈ సినిమాలో నాని టాటు వేయించుకున్నాడని.. మండిపడుతున్నారు నెటిజెన్స్. అయితే తెలంగాణ వాదులు మాత్రం.. ఈ సినిమాకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. సినిమాలో తెలంగాణ యాస భాష... చాలా స్పష్టంగా ఉందని పేర్కొంటున్నారు. అచ్చం దసరా సినిమాలో ఉన్న భాషను ఇందులో వాడినట్లు గులాబీ పార్టీ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు.