
అరియానా, అషు రెడ్డీ వీరిద్దరూ కూడా టిక్ టాక్ ఇంస్టాగ్రామ్, రిల్స్ వల్లే బాగా క్రేజ్ అయితే సంపాదించుకున్నారు.. ఇలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి మరికొంత క్రేజ్ సంపాదించుకున్న వీరు అనంతరం పలు షోలకు యాంకరింగుగా కనిపిస్తూ ఉన్నారు.అషు రెడ్డీ యాంకర్ గానే కాకుండా కొన్ని చిత్రాలలో కూడా కనిపిస్తూ ఉన్నది. నిరంతరం సోషల్ మీడియాలో అయితే హాట్ ఫోటోలతో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా వీరిద్దరూ ఫ్యామిలీ స్టార్స్ అనే ప్రోగ్రాంలో కనిపించారు. అందుకు సుధీర్ యాంకర్ గా చేయగా అందుకు సంబంధించి ప్రోమో కూడా వైరల్ అవుతోంది. అయితే ఈ ఎపిసోడ్ లో అషు రెడ్డీ మాట్లాడుతూ గత సంవత్సరం తనకు కొంత హెల్త్ ప్రాబ్లం వచ్చిందని అయితే అప్పుడు ఒక ఫ్రెండ్ నుంచి తాను కనీసం కాల్ అయిన ఎక్స్పర్ట్ చేశానని కానీ తను మాత్రం అలా చేయలేదని ఆ ఫ్రెండ్ ఎవరో కాదు అరియానానే అంటూ తెలియజేసింది. ఈ విషయం పైన అరియానా మాట్లాడుతూ ఇన్ని రోజులు నువ్వు ఇది మనసులో పెట్టుకున్నావా.. నేను కాల్ చేసినప్పుడు మీ హెయిర్ డ్రెస్సర్ కాల్ లిఫ్ట్ చేశారని తెలిపింది.. మీ అమ్మగారికి కూడా రెండు మూడు సార్లు కాల్ చేశాను మళ్లీ చేపిస్తానని చెప్పింది. కానీ ఒక సర్జరీ అయిన పేషెంట్ వీడియో కాల్ ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి అంటు అషు రెడ్డి, ఆరియానా మధ్య పిక్స్ స్టేజ్లో మాటలు యుద్ధం జరిగింది. మొత్తానికి వీరి మధ్య జరిగింది అసలు విషయం ఏంటన్నది చూడాలి మరి..