మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో అనేక మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో చిరంజీవి వరుస పెట్టి యంగ్ దర్శకులకు ఛాన్స్ లను ఇస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈయన బింబిసార అనే సినిమాకు దర్శకత్వం వహించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

ఇలా కేవలం ఒకే ఒక సినిమా అనుభవం ఉన్న యంగ్ దర్శకుడితో ప్రస్తుతం చిరంజీవి సినిమా చేస్తున్నాడు. ఇలా కేవలం వశిష్ట తో మాత్రమే కాకుండా వరుస పెట్టి చిరంజీవి యువ దర్శకులకు అవకాశాలను ఇస్తున్నాడు. చిరంజీవి తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో యంగ్ దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం సమ్మర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిరంజీవి ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చాడు.

మూవీ తర్వాత చిరంజీవి , శ్రీకాంత్ ఓదెల అనే యువ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇలా వరుస పెట్టి చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ దర్శకులకు అవకాశాలను ఇస్తూ వెళుతున్నాడు. ఇది ఇలా ఉంటే విశ్వంబర మూవీ ని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వంభర మూవీ పై ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: