
ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 150 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాత కాగా అటు నాని, ఇటు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ పై నమ్మకం ఉండటంతో సుధాకర్ చెరుకూరి ఈ సినిమా కోసం ఖర్చు విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటూ ఉండటం గమనార్హం.
నాని శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ ఏకంగా 8 భాషల్లో విడుదల కానుంది. ఎక్కువ సంఖ్యలో భాషల్లో రిలీజ్ కానుండటం ఈ సినిమాకు మరో విధంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. నాని శ్రీకాంత్ కాంబో వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాని కెరీర్ ప్లాన్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా కోసం మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నాని పారితోషికం 30 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న నాని కెరీర్ విషయంలో ఒకింత ఆచితూచి అడుగులు వేయాలని అభిమానులు ఫీలవుతున్నారు. నాని నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.