టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత పలు వెబ్ సిరీస్ లలో నటించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. అయితే సమంత పుష్ప ది రైజ్ లో ఊ అంటావా స్పెషల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ అన్ని భాషల్లో ఊహించని స్థాయిలో హిట్టైంది.
 
పుష్ప ది రైజ్ మూవీ ఏకంగా 360 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం వెనుక సమంత కూడా ఒక కారణమని చాలామంది భావించారు. అయితే సమంతకు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యతో సమంత డ్యాన్స్ చేస్తున్న ఆ వీడియో ఒరిజినల్ వీడియో కాదు. సమంత ఒళ్లంతా తడమడంతో పాటు గణేష్ ఆచార్య ముద్దు పెట్టుకున్నట్టుగా ఆ వీడియో ఉంది.
 
గణేష్ ఆచార్య హీరోయిన్ డైజీ షా కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయగా ఎవరో కావాలని ఎడిట్ చేసి ఆ వీడియోను నెట్టింట వైరల్ చేయడం జరిగింది. వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ వీడియోను తలపించేలా ఉండటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సమంత ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
 
ఈ తరహా ఘటనల విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సమంత రెమ్యునరేషన్ సైతం ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. సమంత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ తో ఇమేజ్ ను మరింత పెంచుకుని బాక్సాఫీస్ వద్ద పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: