యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ బడ్జెట్ 500 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని మైత్రీ నిర్మాతలు సైతం ఇప్పటికే అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారనే సంగతి తెలిసిందే.
 
మే నెల 20వ తేదీన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా గ్లింప్స్ తో పాటు మరికొన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించే మూవీ కావాలని బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26వ తేదీన రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.
 
మొదట ఈ సినిమాను 2026 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే వార్2 సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాపై పడుతోందని తెలుస్తోంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు తక్కువని భోగట్టా. అయితే మార్చి నెల 26వ తేదీన ఇప్పటికే ది పారడైజ్ సినిమాను ప్రకటించడం జరిగింది.
 
దసరా మూవీ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ మేకర్స్ ఈ రిలీజ్ డేట్ ను ప్రకటించారని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, నాని సినిమాలు పోటీ పడిన సందర్భాలు దాదాపుగా లేవనే సంగతి తెలిసిందే. 2026 సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద ఈ పోటీ ఉంటుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఎన్టీఆర్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: