
మంచు మనోజ్ తన పోస్ట్ లో రెండేళ్ల క్రితం నా లైఫ్ లో అత్యుత్తమమైన నిర్ణయం తీసుకున్నానని నా ప్రపంచన్ని శాశ్వతంగా మార్చిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నానని మంచు మనోజ్ వెల్లడించారు. మౌనిక నా లైఫ్ లోకి అడుగుపెట్టిన రోజు నుంచి నాకు తెలియని కొత్త ప్రేమను అందించిందని మనోజ్ పేర్కొన్నారు. నేను విధిని నమ్మడానికి కారణం మౌనిక అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.
నేను కష్టాల్లో ఉన్న సమయంలో మౌనిక నా గొంతుకగా గందరగోళంలో ఉన్న సమయంలో ప్రశాంతంగా నిలిచిందని మంచు మనోజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం రెండు సంవత్సరాలలో ప్రేమ, సంతోషం, నవ్వులతో ఇద్దరు అందమైన చిన్నపిల్లలతో ఇంటిని తీర్చిదిద్దిందని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. మన పిల్లల విషయంలో తల్లిగా నీ ఆనంతమైన ప్రేమను చూసి ప్రతిరోజూ నీతో ప్రేమలో పడిపోతున్నానని మనోజ్ వెల్లడించారు.
ఈ రెండు సంవత్సరాల లోనే ఎన్నో ఎత్తులు, పతనాలు, విజయాలు, పోరాటాలను ఎదుర్కొన్నామని కానీ వీటన్నింటిలో ఒకటి మాత్రం స్థిరంగా ఉందని అదే మనం అని మనోజ్ పేర్కొన్నారు. నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ నాకు అతిపెద్ద సపోర్టర్ అని మంచు మనోజ్ కామెంట్లు చేయడం గమనార్హం. ఈ రెండేళ్లు నాపై నువ్వు చూపించిన ప్రేమకు జీవితకాలం సరిపోదని మనోజ్ వెల్లడించారు. హ్యాపీ వార్షికోత్సవ శుభాకాంక్షలు మున్నీ అంటూ మనోజ్ కామెంట్ చేశారు.