
లవ్ టుడే, రిటర్న్ ది డ్రాగన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. యూత్ కు నచ్చే యూత్ మెచ్చే కథాంశాలను ఎంచుకోవడం కూడా ప్రదీప్ రంగనాథన్ సక్సెస్ కు ఒక విధంగా కారణమని చెప్పవచ్చు. ధనుష్ పోలికలతో కనిపించే ఈ హీరోకు ఒకింత భారీ స్థాయిలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే తాజాగా ప్రదీప్ రంగనాథన్ కు ధనుష్ ను కాపీ కొడుతున్నారా అనే ప్రశ్న ఎదురు కాగా ఆ ప్రశ్నకు ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రదీప్ రంగనాథన్ చూడటానికి కొన్ని యాంగిల్స్ లో అచ్చం ధనుష్ లా ఉంటారనే సంగతి తెలిసిందే. తాను ధనుష్ ను కాపీ కొట్టాననే కామెంట్లు చాలా కాలం నుంచి వింటున్నానని అయితే తాను మాత్రం ఎవరినీ ఇమిటేట్ చేయడం లేదని ప్రదీప్ రంగనాథన్ క్లారిటీ ఇచ్చారు.
నా ఫిజిక్, ఫేస్ కట్ వల్ల చాలామంది ఈ విషయంలో పొరబడుతున్నారని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. ధనుష్ లాగే నేను ఉండటం నాకు ప్లస్సో మైనస్సో తెలియదని అద్దంలో చూసుకున్న సమయంలో నాకు నేను మాత్రమే కనిపిస్తానని నేను తీసిన సినిమా బాగా ఆడుతుందంటే నేను బాగానే యాక్ట్ చేస్తున్నానని ఫీలవుతున్నానని ప్రదీప్ రంగనాథన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రదీప్ రంగనాథన్ భవిష్యత్తు సినిమాలు సైతం సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.