
సీతారామం వంటి క్లాసిక్ లవ్ స్టోరీని తీసిన హను రాఘవపూడి ప్రభాస్ తో అంతకు మించి భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఇది పాన్ వరల్డ్ సినిమా అవుతుందని దర్శకుడు హను రాఘవపూడి చాలా ధీమాగా వున్నాడు..ఈ సినిమాలో కూడా దర్శకుడు మంచి ప్రేమ కథ చూపించబోతున్నాడు.. ఈ సినిమా లో ప్రభాస్ ఆజాద్ హిందు ఫౌజ్ సభ్యుడిగా కనిపిస్తాడని సమాచారం..అందుకే ఈ సినిమా కోసం 'ఫౌజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసారని తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటించబోతున్నాడనే న్యూస్ వైరల్ అవుతుంది..ప్రస్తుతం సన్నీ డియోల్ టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న 'జాట్' మూవీ లో హీరోగా నటిస్తున్నాడు..సన్నీ డియోల్ కనుక ప్రభాస్ మూవీ లో నటిస్తే ఫౌజీకి బాలీవుడ్ మార్కెట్ పరంగా ప్లస్ అవుతుందని సినీ వర్గాల సమాచారం..