
ఒకానొక సమయంలో పుష్ప చిత్రానికి సంబంధించి అన్ని పాటలు, డైలాగులను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు బాగా దగ్గరయ్యారు డేవిడ్ వార్నర్.. అయితే గత కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా అందుకు సంబంధించి లిక్ బయటికి వచ్చినట్లు తెలుస్తోంది.. అసలు విషయంలోకి వెళ్తే జీవి ప్రకాష్ హీరోగా ఆయన నిర్మాతగా చేసిన కింగ్ స్టోన్ అనే చిత్రం ఈవారం ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది.
ఈ నేపథ్యంలోని ఈ చిత్రానికి సంబంధించి ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర బృందం నిర్వహించగా ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ హీరో నితిన్ తో పాటు డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా రావడం జరిగింది. అలాగే మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాతలు కూడా హాజరయ్యారు. ఇక్కడే రాబిన్ హుడ్ చిత్రానికి సంబంధించి ఏదైనా లీక్ ఇవ్వమని అక్కడ ఉన్న ఫ్యాన్స్ అడగగా.. ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ నటిస్తున్నారనే విషయాన్ని బయట పెట్టడం జరిగింది. ఆయన ఇందులో ఒక చిన్న అతిధి పాత్రలో కనిపించబోతున్నారని తెలియజేశారు.. దీంతో పాటు అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు మరి డేవిడ్ వార్నర్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారో చూడాలి మరి. గతంలో కూడా గన్ను పట్టుకొని హెలికాప్టర్ దిగుతున్న ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఈ పాత్ర సినిమాకి ప్లస్ అవుతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.