
అయితే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో దర్శకుడు అశ్వత్ మారిముత్తు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని ఉందని వెల్లడించారు. అయితే తాజాగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సక్సెస్ మీట్ లో అశ్వత్ మారిముత్తు డ్రాగన్ సినిమాను మహేష్ బాబు చూడాలని కోరారు. మహేష్ బాబు ఈ సినిమాను చూసి రివ్యూ ఇస్తే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఇప్పటికే 100 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్కును దాటేసింది. అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ స్టార్ డైరెక్టర్ రాజమౌళి నాకు స్పూర్తి అని చెప్పుకొచ్చారు. ఎమోషన్స్ కనెక్ట్ అయితే ఏ ఇండస్ట్రీలో అయినా సినిమా హిట్ అవుతుందని రాజమౌళి గారు చెబుతూ ఉంటారని అశ్వత్ మారిముత్తు వెల్లడించారు. ప్రేమ, స్నేహం, పేరెంట్స్ అనే ఎమోషన్స్ మా సినిమాలో ఉన్నందుకు ఈ సినిమా విజయం సాధించిందని ఆయన తెలిపారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు డ్రాగన్ సినిమాను చూసి కచ్చితంగా గర్విస్తారని నేను అనుకుంటున్నానని అశ్వత్ మారిముత్తు పేర్కొన్నారు. దయచేసి ఈ సందేశాన్ని మహేష్ బాబు వరకు చేరవేయాలని మహేష్ బాబు ఈ సినిమా చూసేలా చేయాలని ఆయన కామెంట్లు చేశారు. అశ్వత్ మారిముత్తు వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.