టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పార్టీని స్థాపించిన తర్వాత వచ్చిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో ఈ పార్టీ పోటీ చేయలేదు. ఇక 2019 వ సంవత్సరం జనసేన పార్టీ మొదటి సారి అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసింది. ఎన్నికలలో ఈ పార్టీకి భారీ అపజయం దక్కింది. అయిన కూడా పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయకుండా ఈ పార్టీని ముందుకు నడిపించాడు.

ఇక 2024 వ సంవత్సరం జనసేన పార్టీ తెలుగు దేశం , బిజెపి లతో పొత్తుల భాగంగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్ని అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిందో అన్నింటిలో గెలిచి 100 శాతం విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలక మంత్రి పదవుల్లో కొనసాగుతున్నాడు. ఇక జనసేన పార్టీ అద్భుతమైన స్థాయిలో అభివృద్ధి చెందడంతో ఈ పార్టీ ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహించాలి అని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే జనసేన పార్టీ ఆవిర్భావ సభను చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రముఖ నిర్మాత అయినటువంటి బన్నీ వాసు ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నాడు. అందులో ఈయనకు మీరు జనసేన ఆవిర్భావ సభకు సంబంధించిన కీలక పనులను చూసుకుంటున్నారట నిజమేనా అనే ప్రశ్న ఎదురైంది. దానికి బన్నీ వయసు సమాధానం ఇస్తూ ... అవును నేను ఆ సభకు సంబంధించిన పబ్లిసిటీ మరియు సోషల్ మీడియా బాధ్యతలను చూసుకుంటున్నాను. నాకు తెలిసి ఆ సభ ప్రపంచం లోనే గొప్ప సభగా ఉండబోతుంది అని అనిపిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: