ఉపాసన .. ఎంత మంచి మనిషి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 0% నెగెటివిటీ అంటూ జనాలు ఉపాసన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.  పేరుకు పెద్ద ఇంటి కోడలు .. మరొక పక్క పెద్ద ఇంటి ఆడపడుచు. కాని సింప్లి సిటీ నే ప్రధానంగా తీసుకుని ముందుకు వెళుతూ ఉంటుంది.  ఎన్నిసార్లు ఉపాసన కామన్ పీపుల్స్ కి అవసరమైన సలహాలు ఇచ్చిందో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఉపాసన కామన్ పీపుల్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది . ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వెళుతూ ఉంటుంది.


అందుకే ఆడవాళ్లు ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలి ..హెల్త్ పట్ల ఎలా కేర్ తీసుకోవాలి.. ఎలాంటి ఫుడ్ తినాలి అంటూ చెప్పుకొస్తూ ఉంటుంది . కాగా రామ్ చరణ్ ని పెళ్లి చేసుకున్నాక కాస్త సినిమా టచ్ కూడా ఉపాసనకు వచ్చిందని చెప్పాలి .కొన్ని కొన్ని షూటింగ్లలో కూడా ఆమె  అటెండ్  అవుతూ ఉంటుంది . రామ్ చరణ్ ఎంతోమంది హీరోయిన్ లతో వర్క్ చేశారు . వాళ్లందరితో కూడా ఉపాసన బాగా క్లోజ్ గా మింగిల్ అవుతూ ఉంటుంది . కానీ ఉపాసన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే మాత్రం టక్కున ముందు అందరూ చెప్పేది హీరోయిన్ తమన్నా .



హీరోయిన్ తమన్నా నటన అన్నా.. డాన్స్ చేసే విధానం అన్నా.. ఉపాసనకి చాలా చాలా ఇష్టం.  ఆ తర్వాత సమంత అంటే ఆమెకు మరీ మరీ  ఇష్టం. సమంత కష్టపడి పైకి ఎదిగిన తీరు ఎప్పుడు ఉపాసనకు ఇన్స్పిరేషన్ గానే ఉంటుంది . ఉపాసన సినిమాలను చాలా తక్కువగా చూస్తుంది . తెలుగు సినిమాలను మరీ తక్కువగా చూస్తుంది . కానీ తమన్నా సినిమాలు అంటే మాత్రం ఆమెకి బాగా నచ్చుతూ ఉంటాయట . అంతేకాదు తమన్నా ఆమె ఫ్రెండ్స్ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటుందట . తమన్న బర్త్డ డే సందర్భంగా ఉపాసన అప్పుడు ఇచ్చిన గిఫ్ట్ ఎంత ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే . ప్రెసెంట్ రామ్ చరణ్ - బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు . ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుపుకుంటుంది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: