గత కొన్నేళ్లుగా మలయాళ సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ బడ్జెట్ కి మంచి మంచి చిత్రాలు విడుదలవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం హీరో ఇజం చిత్రాలే కాకుండా కంటెంట్ బలంగా ఉండి విభిన్నమైన కథలతో అందరిని అబ్బురపరుస్తూ ఉన్నది మలయాళ సినీ ఇండస్ట్రీ. ముఖ్యంగా ఎక్కువగా మిస్టరీ త్రిల్లర్, హర్రర్ వంటి చిత్రాలను చూసేందుకు ఆడియన్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది థియేటర్లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ఏకంగా బాక్సాఫీస్ వద్ద 9 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించి 55 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందట.


ఆ చిత్రమే రేఖా చిత్రమ్.. ఇందులో మలయాళ నటుడు ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం చాలామంది ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రేఖా చిత్రమ్ ఓటీటి స్త్రమ్మింగ్ డేట్ మార్చి 7వ తేదీన సోనీ లీవ్ లో స్ట్రిమింగ్ కాబోతున్నది. మలయాళం తో పాటుగా తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండబోతుందట.


స్టోరీ విషయానికి వస్తే వివేక్ గోపీనాథ్.. పోలీస్ ఆఫీసర్గా అదరగొట్టాడని అతడు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఒక గ్యాంబ్లింగ్ కుంభకోణం తర్వాత తిరిగి మళ్ళీ విధులలోకి చేరుతారు.. అలా సుమారుగా 40 ఏళ్లు గా పరిష్కారం కానీ ఒక మర్డర్ కేసుని అప్పగించడం జరుగుతుందట. అయితే ఈ కేసుని పరిష్కరించి మళ్ళీ తాను డిపార్ట్మెంట్లో ఎలాంటి పేరు పొందుతారు అన్న కథాంశంతో తెరకెక్కించారు. డైరెక్టర్ జోఫిన్ టీచాకో దర్శకత్వం వహించారట. ఈ చిత్రంలో అనన్వర రాజన్, మనోజ్ కేజయాన్ వంటి వారు కీలకమైన పాత్రలో కనిపించారు. మరి మలయాళం లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రేఖా చిత్రమ్ సినిమా మరి తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: