చాలామంది నటీనటులు ప్రేమించుకొని పెళ్లిళ్లు చేసుకుంటే మరి కొంతమందేమో పెళ్లిళ్లు చేసుకోకుండానే మధ్యలోనే వారి లైఫ్ ఎటూ కాకుండా పోతుంది. కొంతమంది గాఢంగా ప్రేమించుకున్న తర్వాత పెళ్లి కాకపోతే వారి బాధ వర్ణతాతీతం. మామూలు వాళ్ళు ఎలా అయితే బాధపడతారో సెలబ్రెటీలకు కూడా అలాంటి బాదే ఉంటుంది. అయితే ఓ స్టార్ హీరో తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి పీటల మీద చూసి ఆ బాధ భరించలేక సిగరెట్లతో కాల్చుకున్నాడట. మరి ఇంతకీ అలాంటి పని చేసిన ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి పీటల మీద చూసి సిగరెట్ల తో కాల్చుకున్న ఆ హీరో ఎవరో కాదు నటుడు రాజ్ కపూర్.బాలీవుడ్ హీరో రాజ్ కపూర్ అంటే ఇప్పటి జనరేషన్ వారికి తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఈయన స్టార్ హీరో.. అయితే ఈయన పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా హీరోయిన్ నర్గీస్ ని ప్రేమించారట. 

అయితే తమ మధ్య ప్రేమ ఉన్న విషయాన్ని అంగీకరించలేదట. అంతకంటే మించి తమ మధ్య బాండింగ్ ఉందని రాజ్ కపూర్ కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. రాజ్ కపూర్ నర్గీస్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారా అంటే అదీ లేదు. ఎందుకంటే తన భార్యను వదిలేయాలి అనుకోలేదు. అలాగే హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. కానీ నర్గీస్ ని ఉద్దేశించి ఆమె ఒక దేవత లాంటిదని, ఆమెతో నాకు మంచి అనుబంధం ఉందని, ఆర్కే స్టూడియోలో ఆమె ఓ భాగం అంటూ చెప్పుకొచ్చారు. అయితే రాజ్ కపూర్ ని నర్గిస్ ని గాఢంగా ప్రేమించినప్పటికీ ఆయన మాత్రం తన భార్య పిల్లల్ని వదిలి నర్గీస్ ని రెండో పెళ్లి చేసుకోవాలనుకోలేదట. దాంతో చివరికి నర్గీస్ నటుడు సునీల్ దత్ ని పెళ్లాడింది.

అయితే ఈ విషయం తట్టుకోలేని రాజ్ కపూర్ పిచ్చివాడిలా ప్రవర్తించాడని, తన స్నేహితులందరితో చెప్పుకొని వెక్కివెక్కి ఏడుస్తూ గుండె పగిలినట్టుగా బాధపడ్డారని, అలాగే ఆ బాధలో సిగరెట్ తో తన చేతివేళ్లను కూడా కాల్చుకున్నారట. ఎందుకంటే నర్గీస్ పెళ్లి జరిగేది నిజమా కాలనా తెలుసుకోవడానికి తనకి తానే టార్చర్ చేసుకున్నాడట. అంతేకాదు నర్గీస్ ని తాను మోసం చేయడం కాదు తననే నర్గీస్ మోసం చేసిందని రాజ్ కపూర్ నమ్మేవాడట. అలా నర్గీస్ వేరే నటుడిని పెళ్లి చేసుకొని తన మనసుకు తీవ్రమైన గాయాన్ని చేసింది అని తన కొలీగ్స్ తో చెప్పుకొని బాధపడ్డాడు అంటూ మధు జైన్ "ది కపూర్స్: ది ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియన్ సినిమా" అనే బుక్ లో రాసుకోచ్చారు.ప్రేమించిన హీరోయిన్ ని పెళ్లి చేసుకోలేక ఆమె పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక రాజ్ కపూర్ తనని తానే టార్చర్ చేసుకున్నారట

మరింత సమాచారం తెలుసుకోండి: