యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో జాన్వి కపూర్ , తారక్ కి జోడిగా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ కి మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.

ఈయన అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ నుండి మేకర్స్ కొన్ని పాటలను విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి విడుదల చేసిన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా నుండి చుట్టమల్లే అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఆ సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా విడుదల అయిన తర్వాత కూడా ఈ పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 400 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఇలా దేవర పార్ట్ 1 మూవీ లోని చుట్ట మల్లే అంటూ సాగే పాటకు ప్రేక్షకుల నుండి ఇప్పటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ సాంగ్లో తారక్ , జాన్వీ కపూర్ ఇద్దరు తమ డాన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక జాన్వి కపూర్ ఈ పాటలో తన డ్యాన్స్ తో పాటు అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అనిరుద్ ఈ సాంగ్ కి ఇచ్చిన సంగీతం ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: