టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కామెడీ టైమింగ్ ఉన్న కమెడియన్లలో ధనరాజ్ ఒకరు. ధనరాజ్ తక్కువ సినిమాల్లోనే హీరోగా నటించినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు హృదయాలను హత్తుకునే కథలతో తెరకెక్కడం గమనార్హం. ధనరాజ్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రామం రాఘవం మూవీ రెండు వారాల క్రితం థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
 
ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించకపోయినా అతి త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఈ నెల 15వ తేదీలోపు రామం రాఘవం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. థియేటర్లలో యావరేజ్ రెస్పాన్స్ ను అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.
 
మరోవైపు ఈటీవీ విన్ యాప్ మొదలై ఇప్పటికే రెండు సంవత్సరాలు కాగా ఇతర భాషల్లోకి సైతం ఈ యాప్ విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. రామం రాఘవం సినిమాకు ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ధనరాజ్ రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో హీరోగా నటిస్తారేమో చూడాల్సి ఉంది. ధనరాజ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.
 
ధనరాజ్ గతంలో ఒక సినిమాను నిర్మించి చేతులు కాల్చుకున్నారు. ధనరాజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావాలని బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ధనరాజ్ బుల్లితెరకు కూడా ప్రస్తుతం దూరంగానే ఉన్నారు. ధనరాజ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మరిన్ని విజయాలను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ధనరాజ్ ను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: