ఎవరైనా ఫస్ట్ నైట్ కోసం రెస్టారెంట్లలో రూమ్ బుక్ చేసుకుంటారు. లేదా విదేశాలకు హనీమూన్ కి వెళ్లి అక్కడ తమ ఫస్ట్ నైట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటారు. ఇక మరికొంతమందేమో ఇంట్లోనే సింపుల్ గా రూమ్ లో డెకరేషన్ లో తన మొదటి రాత్రి చేసుకుంటారు. కానీ ఈ హీరో మాత్రం ఏకంగా తన ఫస్ట్ నైట్ ని ఓ ట్రైన్ లో చేసుకున్నారట. మరి ఇంతకీ ట్రైన్ లో శోభనం చేసుకున్న ఆ హీరో ఎవరు? ఎందుకు అలా చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలు బిజీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. వారికి తినడానికి టైం కూడా దొరకదు. ఇక మరి కొంతమందేమో చేతినిండా సినిమాలతో పెళ్లిళ్లను కూడా లేట్ చేస్తుంటారు. ఈ జనరేషన్ లో ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన సినిమాలు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ పెళ్లిని పక్కన పెట్టారు. 

అయితే గతంలో ఓ హీరో కూడా పెళ్లి చేసుకోవడానికి టైం లేకపోవడంతో సింపుల్గా రెండు మూడు రోజుల్లో పెళ్లిని కానిచ్చేసి శోభనాన్ని ట్రైన్ లో చేసుకున్నడట. మరి ఇంతకీ ట్రైన్ లో ఫస్ట్ నైట్ చేసుకున్న ఆ హీరో ఎవరయ్యా అంటే మెగాస్టార్ చిరంజీవి.అవును మీరు వినేది నిజమే. చిరంజీవి సురేఖలు తమ ఫస్ట్ నైట్ ని ట్రైన్ లోనే చేసుకున్నారట.అయితే ఇది చిరంజీవి చేసుకున్న ప్లాన్ అయితే కాదు. ఓ డైరెక్టర్ చేసిన ప్లాన్. ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే రాఘవేంద్ర రావు.. అప్పట్లో చిరంజీవి పెళ్లి జరిగిన సమయంలో చిరంజీవి రాఘవేంద్రరావు మూవీలో చేస్తున్నారట. డేట్స్ ఎక్కువగా లేకపోవడంతో పెళ్లి తొందరగా కానిచ్చేసి మళ్లీ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారట. అలా ఊటీలో షూటింగ్ అయిపోవడంతోనే చెన్నైకి ట్రైన్ లో వద్దామని చిరంజీవి నిర్ణయించుకున్నారట.

ఇక ఈ విషయం తెలుసుకున్న రాఘవేంద్రరావు పాపం నా సినిమా కోసం పెళ్లి చేసుకొని షూటింగ్ కి వచ్చేసాడు. ఫస్ట్ నైట్ కూడా జరగలేదని తెలుసుకొని ట్రైన్ లో ఒక స్పెషల్ బెర్త్ బుక్ చేసి మరీ అందులో ఫస్ట్ నైట్ గది ఎలా ఉంటుందో అలా డెకరేట్ చేసి పెట్టారట. అయితే ఇది ట్రైన్ ఎక్కి ఆ స్పెషల్ బెర్త్ చూసే వరకు కూడా సురేఖకు గానీ చిరంజీవికి గానీ తెలియదట.సడన్ గా దాన్ని చూడడంతో ఏంటి దీన్ని ఇలా డెకరేట్ చేశారు అని షాక్ అయిపోయారట. అయితే ఇదంతా రాఘవేందర్రావు చేశారు అనే విషయం తెలుసుకున్న చిరంజీవి ఫోన్ చేసి మరీ థాంక్యూ చెప్పారట. అలా రైల్లో మా ఫస్ట్ నైట్ ఎప్పటికీ ఓ మధుర జ్ఞాపకమే అంటూ చిరంజీవి సౌందర్య లహరి ప్రోగ్రాం లో రాఘవేంద్రరావు గురించి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: