సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చెప్పిన టైంకి సినిమా రిలీజ్ చేసే డైరెక్టర్ లు చాలా చాలా తక్కువ . పూరి జగన్నాధ్  లాంటి వాళ్ళు తప్పిస్తే మిగతా డైరెక్టర్ అందరూ కూడా అనుకున్న డేట్ ఒకటి రిలీజ్ చేసే డేట్ ఒకటి అవుతూ ఉంటుంది . అది ఏవైనా కారణాలు కావచ్చు . సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడం కారణంగా కావచ్చు .. లేకపోతే మేకర్స్ ఎడిటింగ్ ఆలస్యం చేయడం కారణంగా కావచ్చు ..వేరే సినిమాలు ఆ టయానికి రిలీజ్ అవుతూ ఉంటే మన సినిమా కలెక్షన్స్ దెబ్బతింటాయి అన్న కారణంగా కావచ్చు.. రీజన్ ఏదైనా సరే కొన్ని కొన్ని సార్లు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ గా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు .


ఒక హీరో సినిమా పలానా తేదీన రిలీజ్ అవుతుంది అని చెప్పి ఫ్యాన్స్.. ఆ రోజున అశలు పెట్టుకొని ఉంటారు . కానీ లాస్ట్ మినిట్లో లేదు లేదు ఆ రోజు రావడం లేదు.  సారీ నెక్స్ట్ ఒక డేట్ కి గూస్ బంప్స్ అప్డేట్ తో వస్తాము అంటూ మేకర్స్ ఏదో ఒక విధంగా నచ్చ జెప్పడానికి చూస్తూ ఉంటారు . అయితే సినిమా ఇండస్ట్రీలో  ఇప్పుడు ఒక ఫిలిం అత్యధిక సార్లు వాయిదా పడిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. అది కూడా కోట్లాదిమంది ఫ్య్యన్స్ ఇష్టపడిన హీరో .



ఇప్పటికే ఈ సినిమా ఏంటో మీకు అర్థమైపోయింది అనుకుంటా..ఎస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు . తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలోనే కాదు ఇండియన్ ఫిలిం హిస్టరీ చరిత్రలోనే అత్యధిక సార్లు వాయిదా పడిన చిత్రంగా హరిహర వీరమల్లు సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది . ఎప్పుడో 2021 వ సంవత్సరంలో మొదలైన ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంటుంది . అంతేకాదు ఈ సినిమా చాలా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది . అయితే ఎట్టకేలకు షూటింగ్ చివరి దశకు వచ్చినట్లు తెలుస్తుంది.  ఈ నెల 28 చిత్రం విడుదల అవ్వబోతున్నట్లు మేకర్స్ ముందుగా ప్రకటించారు . కానీ అనుకున్న డేట్ కి ఈ సినిమా రిలీజ్ కావడం లేదట . కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ బ్యాలెన్స్ ఉండడం కారణంగానే ఈ సినిమా ఇంకా ఆలస్యం కాబోతుందట . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే నెల 17వ తారీఖున విడుదల చేయాలి అని ఆలోచనలో ఉన్నారట . మార్చి 15 తర్వాత కొత్త విడుదల తేదిని
అనూన్స్ చేయబోతున్నారట..!

మరింత సమాచారం తెలుసుకోండి: