మాటలు మాంత్రికుడిగా తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్.. ఇండస్ట్రీలో దర్శకుడుగా మారక ముందు రచయితగా ఎన్నో సినిమాలకు పని చేసిన అనుభవం ఉంది  త్రివిక్రమ్ కి.అయితే అలాంటి ఈయన నోటి నుండి వచ్చిన ఎన్నో డైలాగులు సినిమాల్లో మంచి గుర్తింపు సంపాదించాయి.ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమాలో ఎన్నో సందేశాత్మక డైలాగులు ఉంటాయి అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే అలాంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచయితగా చేసిన బ్లాక్ బస్టర్ మూవీ నువ్వే కావాలి..తరుణ్ హీరోగా..రిచా హీరోయిన్ గా.. చేసిన ఈ మూవీకి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. 

ఇక ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మితగా చేయగా..ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి కిషోర్ వర్క్ చేశారు.అయితే ఎలాంటి అంచనాలు లేకుండా 2000 సంవత్సరంలో విడుదలైన నువ్వే కావాలి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. కథపరంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ మూవీకి రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ మొదటిసారి ఈ సినిమాకి అడ్వాన్స్ అందుకున్నారట.. అలా పార్క్ లో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో త్రివిక్రమ్ కి నువ్వే కావాలి కథ చెప్పే అవకాశం వచ్చిందట.

అలా ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేసిన రవి కిషోర్ కి నువ్వే కావాలి సినిమా స్టోరీ మొత్తం చెప్పారట త్రివిక్రమ్.అయితే కథ విన్న రవి కిషోర్ కి స్టోరీ బాగా నచ్చి అద్భుతంగా ఉంది అనుకొని వెంటనే చెక్ తీసి అడ్వాన్స్ ఇచ్చారట. అదే త్రివిక్రమ్ కి వచ్చిన మొదటి రెమ్యూనరేషన్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలా తనకి వచ్చిన అడ్వాన్స్ తో త్రివిక్రమ్ ఒక బైక్ కొనుక్కున్నారట. అయితే ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ బయటపెట్టారు. అలా రచయితగా తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన త్రివిక్రమ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న దిగ్గజ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: