- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ స్టార్ సినిమా ఓజి. యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డి.వి.వి. దానయ్య నిర్మాత కావటం విశేషం. పవన్ కళ్యాణ్ కు ఇప్పుడున్న క్రేజ్‌తో పాటు.. గ్యాంగ్ స్టార్ కథాంశం తో వస్తున్న సినిమా కావడంతో .. సినిమా పై అంచనాలు మామూలుగా లేవు అన్నది వాస్తవం. పవన్ ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాతో పాటు .. ఓజి , అలాగే ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మించే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా పవన్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలలో కంపేరిజన్ చేసి చూస్తే.. ఓజీ సినిమాకే అటు ప్రేక్షకులతో పాటు, పవన్ అభిమానులతో పాటు, ట్రేడ్ వర్గాలలో ఎక్కువగా క్రేజీ కనిపిస్తోంది అన్నది వాస్తవం.


ఓజి సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ . 115 నుంచి రూ . 120 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ఏరియాల కు బిజినెస్ ఎంక్వయిరీలు అయితే మొదలయ్యాయి. వీర‌మ‌ల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరు ? చెప్పలేని పరిస్థితి. ముందుగా ఈ నెల 28న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఆ తర్వాత ఓజి సినిమా ఉంటుంది. ఓజి ఆగస్టులో ఉంటుందా.. లేదా దసరాకు వస్తుందా.. అన్నది తర్వాత సంగతి. బిజినెస్ ఎంక్వైరీలు మాత్రం బాగా జరుగుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణ వరకు రూ.120 కోట్ల టార్గెట్ అంటే చాలా పెద్ద టార్గెట్ అని చెప్పాలి. మరి పవన్ ఈ టార్గెట్ తన క్రేజ్‌తో ఎలా దాటతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: