యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మేకర్స్ ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. కానీ ఈ మూవీ కి డ్రాగన్ అనే టైటిల్ ను మేకర్స్ అనుకుంటున్నాట్లు ఇదే టైటిల్ను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసి మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉండడం , పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఇప్పటికే ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ను అత్యంత స్పీడుగా పూర్తి చేయాలి అని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ వరకు పూర్తి చేయాలి అని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు , ఆ తర్వాత ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చాలా వేగంగా పూర్తి చేసి ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కి సంబంధించిన విడుదల తేదీని కూడా మేకర్స్ మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే కొంత కాలం క్రితం దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించిన తారక్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: