టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆఖరుగా జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం తారక్ "వార్ 2" అనే హిందీ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు.

ఇప్పటికే వార్ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించి ఉండడం , ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ షూటింగ్ను మరికొన్ని రోజుల్లోనే పూర్తి చేసి ఈ మూవీ ప్రమోషన్స్ ను కూడా మొదలు పెట్టాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరి కొంత కాలం లోనే ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి ఈ సమ్మర్ నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను మొదలు పెట్టాలి అని మూవీ బృందం ఓ ఆలోచనకు వచ్చినట్లు , అందుకు అనుగుణంగా ప్రణాళికలను వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ "వార్ 2" సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ మూవీ లో నటిస్తున్నాడు. ఆ వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తూనే అటు వార్ 2 సినిమా ప్రమోషన్లలో కూడా తారక్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: