టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటి వరకు కెరియర్ లో ఎన్నో విజయాలను అందుకున్న రవితేజకు ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాలు దక్కడం లేదు. ఈ మధ్య కాలంలో అనేక సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన రవితేజకు వరుసగా అపజయాలే దక్కుతున్నాయి. 

ఇది ఇలా ఉంటే రవితేజ ఈ మధ్య కాలంలో సంక్రాంతికి తన సినిమాను విడుదల చేయాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసిన అది కుదరడం లేదు. ఆఖరుగా రవితేజ నటించిన క్రాక్ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది. కొంత కాలం క్రితం రవితేజ "ఈగల్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని 2024 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. కానీ ఆ సంవత్సరం సంక్రాంతికి చాలా సినిమాలు విడుదలకు రెడీగా ఉండడంతో ఈ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకొని 2024 ఫిబ్రవరి నెలలో విడుదల అయింది. 

ఇకపోతే ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ కూడా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే రవితేజ , తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్లో మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ చేసి ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల చేయాలి అని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా అయినా సంక్రాంతి పండుగకు విడుదల అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: