మెగా హీరో రామ్ చరణ్ ఈ ఏడాది ఆరంభంలో గేమ్ ఛేంజర్ సినిమా విడుదల చేయగా భారి అంచనాల మధ్య విడుదలై అభిమానులను నిరుత్సాహపరిచింది. అందుకే ఈసారి ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బుచ్చిబాబుతో ప్లాన్ చేశారు. ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రామాగా తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ సినిమా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. రామ్ చరణ్ సరసన మొదటిసారిగా జాన్వీ కపూర్ నటిస్తూ ఉన్నది.


అయితే ఈ సినిమా షూటింగ్ గత ఏడాది నవంబర్ నెలలో మైసూర్ ప్రాంతంలో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఇప్పుడు రెండవ షెడ్యూల్ ని కూడా హైదరాబాదులో భారీ సెట్స్ మధ్య చిత్రీకరించినట్లు సమాచారం చిత్ర బృందం. గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ విరామం కావడం చేత తదుపరి షెడ్యూల్ ఢిల్లీలో మొదలు పెట్టబోతున్నారట. అయితే అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను తీయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ రామ్ చరణ్ పాల్గొనబోతున్నారు.


అలాగే మరొకవైపు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి మూడు పాటలు అందించబోతున్నారట. ఈ పాటలు కూడా చిత్ర బృందం విని బాగా వార్తలు వినిపిస్తున్నాయి.Rc -16 చిత్రానికి మ్యూజిక్ కి ప్లస్ అవుతుంద. ఇక ఈనెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ ని కూడా రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మొత్తానికి రామ్ చరణ్ హస్తినాకి పయనం అయ్యారని విషయం అభిమానులకు తెలియగానే అక్కడ లుకింగ్ ఎలా కనిపిస్తారు అనే విషయం పైన అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఏదైనా అప్డేట్ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: