పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం భీమ్లా నాయక్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుపాటి రానా కూడా హీరోగా నటించాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందించాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యా మీనన్ నటించగా ... దగ్గుపాటి రానాకు జోడిగా సంయుక్త మీనన్ నటించింది. సంయుక్త మీనన్ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయింది. మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంయుక్త మీనన్ ఈ సినిమాతో దక్కించుకుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా మలయాళ మూవీ అయినటువంటి అయ్యప్పనున్ కోషియన్ అనే సినిమాకు అధికారికా రీమిక్ గా రూపొందింది. ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన పాత్రకు మొదటి ఆప్షన్ ఆయన కాదట. మరో హీరోను ఆ పాత్రకు అనుకోగా ఆయన ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ కు ఆ అవకాశం వచ్చిందట. ఇంతకి బీమ్లా నాయక్ సినిమాలో పవన్ పాత్రకి ముందు అనుకున్నది ఎవరు ..? ఆయన ఎందుకు ఆ సినిమా ఆఫర్లు రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

అయ్యప్పనున్ కోషియన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలి అనుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పాత్ర కోసం మొదట ఈ మూవీ బృందం వారు బాలకృష్ణ ను అనుకున్నారట. అందులో భాగంగా బాలకృష్ణ ను సంప్రదించి ఆయనకు సినిమాలు కూడా చూపించారట. సినిమా మొత్తం చూసిన ఆయన ఆ పాత్రలో తనకంటే పవన్ కళ్యాణ్ బాగుంటాడు ... ఆయనను సంప్రదించి ఆయనతో వీలైతే ఆయనతో ఆ పాత్రను చేయించండి అని సూచించాడట. దానితో పవన్ కళ్యాణ్ ను కలిసి సినిమాను చూపించగా , ఆయన ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన పాత్రలో పవన్ కళ్యాణ్ నటించి మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: