టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారక్ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు. అందులో అనేక మంది హీరోయిన్లతో ఆడి పాడాడు. ఇకపోతే తారక్ తన కెరీర్లో ఇద్దరు హీరోయిన్లతో మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో సినిమాలు చేశాడు. ఇక అందులో ఒక హీరోయిన్ తో నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇంతకి ఆ హీరోయిన్లు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

తారక్ తన కెరీర్ లో ఎక్కువ శాతం కాజల్ , సమంత లతో నటించాడు. తారక్ కొన్ని సంవత్సరాల క్రితం బృందావనం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో తారక్ కి జోడిగా కాజల్ , సమంత నటించారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఈ మూవీ లో తారక్ , కాజల్ ... తారక్ , సమంత జోడీకి కూడా మంచి ప్రశంసలు దత్తాయి. ఇక ఆ తర్వాత తారక్ హీరోగా రూపొందిన బాద్ షా , టెంపర్ మూవీలలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ రెండు మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా ... ఈ మూవీ లో కాజల్ స్పెషల్ సాంగ్లో నటించింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కాజల్ , సమంత కాంబోలో బృందావనం , జనతా గ్యారేజ్ సినిమాలు మాత్రమే కాకుండా రభస , రామయ్య వస్తావయ్య అనే సినిమాలు కూడా వచ్చాయి. ఈ రెండు సినిమాలు మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఇలా తారక్ ... కాజల్ , సమంత ఇద్దరితో చేరో నాలుగు సినిమాలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: