సినిమా ఇండస్ట్రీ లో హీరోలకు ఉన్నంత లాంగ్ కెరియర్ హీరోయిన్లకు ఉన్నది అనేది చాలా వరకు వాస్తవం. ఎందుకు అంటే ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి వస్తూ ఉంటారు. కానీ వారికి స్టార్ హీరోయిన్స్ స్టేటస్ వచ్చినా కూడా కొన్ని సంవత్సరాలకు వారికి అవకాశాలు తగ్గడం , ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించడం మెల్లి మెల్లిగా వారు ఇండస్ట్రీ కి కూడా దూరం కావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కొంత మంది విషయంలో మాత్రం ఇది రాంగ్ అని ప్రూవ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత మంది హీరోయిన్లు హీరోలతో సరి సమానంగా కెరియర్ను కొనసాగించిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులు అయినటువంటి త్రిష , నయనతార ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టారు. కెరియర్ను మొదలు పెట్టిన చాలా తక్కువ సమయం లోనే వీరు అద్భుతమైన విజయాలు అందుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకున్నారు. అలా స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఎదిగిన తర్వాత కూడా వీరు ఎప్పుడు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగించారు. ఇకపోతే వీరిద్దరూ ఒకే సమయంలో అటు తమిళ్ , ఇటు తెలుగు రెండు ఇండస్ట్రీ లలో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించారు.

ఇకపోతే ప్రస్తుతం మాత్రం ఈ ఇద్దరు బ్యూటీలు తెలుగులో తక్కువ సినిమాలు చేస్తున్న తమిళ్ లో మాత్రం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే వీరు 40 సంవత్సరాల లోపు ఎంట్రీ ఇచ్చిన కూడా వీరి సినిమాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. అలాగే వీరికి పారితోషకాలు కూడా అద్భుతంగా అందుతున్నట్లు తెలుస్తోంది. ఇలా 40 సంవత్సరాల లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మల జోష్ మాత్రం కోలీవుడ్ ఇండస్ట్రీ లో అసలు తగ్గడం లేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: