సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ కు వెతుక్కుంటూ అవకాశాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఓ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది అంటే వారికి ఎక్కువ శాతం స్టార్ హీరోల సినిమాల్లో , అద్భుతమైన క్రేజ్ ఉన్న మూవీలలో అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న ఓ ఇద్దరికి మాత్రం తెలుగులో అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఇతర భాషల్లో మాత్రం అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్ , పూజా హెగ్డే. 

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయ్యే మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకున్న రకుల్ కి ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. దానితో ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ ఉన్న సమయం లోనే ఈమె తెలుగు సినిమాల కంటే ఇతర భాష సినిమాలపై ఫోకస్ పెట్టడం మొదలు పెట్టింది. దానితో ఈ ముద్దు గుమ్మకు తమిళ్ , హిందీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కానీ ఈమె తెలుగులో మాత్రం సినిమాలు చేయడం లేదు. ఈమె ఆఖరి తెలుగు సినిమా విడుదల అయ్యి చాలా కాలం అవుతుంది. ఇకపోతే పూజ హెగ్డే , నాగ చైతన్య హీరో గా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత తక్కువ సమయం లోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ ఈ ముద్దు గుమ్మకు వరుసగా తెలుగులో అపజయాలు దక్కాయి. దానితో ఈమెకు తెలుగు లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. కానీ ప్రస్తుతం ఈమె వరస పెట్టి తమిళ సినిమాల్లో నటిస్తుంది. అలాగే హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇకపోతే పోయిన సంవత్సరం పూజ హెగ్డే నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కాలేదు. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: