
పుష్ప 2 సినిమా రికార్డులు గురించి చెప్పాల్సిన పనిలేదు ఓటీటిలో కూడా భారీగానే వ్యూస్ రాబడుతున్నది. ప్రస్తుతం రామ్ చరణ్ తో తన 17వ సినిమా అని చేయబోతున్న సుకుమార్ ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అయితే సుకుమార్ రీసెంట్గా వైసిపి పార్టీకి మద్దతుగా నిలిచినట్లు ఒక న్యూస్ అయితే వినిపిస్తోంది. వైసీపీ పార్టీ ఏర్పాటు చేసినటువంటి అవార్డుల వేడుకలకు సైతం సుకుమార్ హాజరు అవ్వడం జరిగింది. ఇదే ఇప్పుడు టాలీవుడ్ అంతా కూడా చర్చనీయాంశంగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో కూడా అల్లు అర్జున్ వైసీపీ నేతలకు సపోర్ట్ చేశారని ప్రచారం కూడా జరిగింది. దీని వల్లే మెగా ఫ్యామిలీకి దూరమయ్యారని ఇప్పుడు సుకుమార్ కూడా అదే బాట పడుతున్నారనే విధంగా టాలీవుడ్ లో గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని సుకుమార్ అభిమానులు కొట్టివేస్తున్నారు అన్నిటిని కూడా రాజకీయాలకు ముడి పెట్టి వేయడం సరైనది కాదు అంటూ తెలియజేస్తున్నారు. సుకుమార్ నిన్న మొన్నటి వరకు అబుదాబిలో ఉంటూ రామ్ చరణ్ సినిమాకు సంబంధించి స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారు.. కానీ ఇటీవల సాక్షి అవార్డులలో కనిపించిన సుకుమార్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.