టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో చాలా సినిమాలను వదిలేశాడు. చిరంజీవి వదిలేసిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. అలా చిరంజీవి తన కెరీర్లో వదిలేసిన సినిమాలలో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న సినిమాలు ఏవి ..? ఆ సినిమాలను ఎందుకు వదిలేసాడు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం అర్జున్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో మన్యంలో మొనగాడు అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మొదటగా అర్జున్ ని కాకుండా కోడి రామకృష్ణ , చిరంజీవి ని హీరోగా అనుకున్నాడట. అందులో భాగంగా చిరంజీవి ని కలిసి కథను కూడా వివరించగా ... కథ మొత్తం విన్న చిరంజీవి స్టోరీ సూపర్ గా ఉంది కానీ నాపై అస్సలు వర్కౌట్ కాదు. మీరు ఇదే కథతో వేరే హీరోతో సినిమా చేయండి బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పాడట. దానితో కోడి రామకృష్ణ , అర్జున్ తో మన్యంలో మొనగాడు అనే టైటిల్ తో చిరంజీవి కి చెప్పిన స్టోరీ తో సినిమాను రూపొందించగా ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా శ్రీదేవి హీరోయిన్గా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్విని దత్ "ఆఖరి పోరాటం" అనే సినిమాను నిర్మించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మొదట నాగార్జున ను కాకుండా చిరంజీవి హీరోగా తీసుకోవాలి అని ఈ మూవీ బృందం వారు అనుకున్నారట. అందులో భాగంగా మొదట ఆయనకు కథను కూడా వివరించగా ... ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ ఆ తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి చిరంజీవి వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా ప్రస్తుతం చేయలేను అని ఆ మూవీ బృందం వారికి చెప్పాడట. దానితో నాగార్జున తో ఆ మూవీ ని రూపొందించగా ఆ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తుంది.

చిరంజీవి ఇలా మన్యంలో మొనగాడు , ఆఖరి పోరాటం అనే రెండు సినిమాలను రిజెక్ట్ చేయగా ... ఆ రెండు మూవీలు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: