
2007 లో టీమ్ ఇండియా తొలి టి 20 ప్రపంచ కప్పును గెలుచుకుంది .. ఆ తర్వాత గీతా బాస్రా , హర్భజన్ సింగ్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపింది .. తర్వాత హర్భజన్ , గీతాను ఐపీఎల్ మ్యాచ్లు చూడడానికి ఆహ్వానించాడు .. ఆ సమయంలో ఆమె ఐపిఎల్ చూడడానికి వెళ్ళలేక పోయింది .. కానీ కొన్ని రోజుల్లోనే వారు ఒకరిని ఒకరు చూసుకోవటం మొదలుపెట్టారు .. ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు .. ఆ స్నేహమే ప్రేమగా మారింది .. అలా హరిభజన్ గీతాకు తన లవ్ ను ప్రపోజ్ చేశాడు .. కానీ గీత ఆ సమయంలో ఆ ప్రేమను అంగీకరించేందుకు రెడీగా లేదు .. ఆమె తన కెరియర్ గురించి కొంత ఆందోళనలో ఉంది .. అలా కొన్ని రోజులకు హర్బజన్ సింగ్ ను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పింది.
అయితే గీత బ్రిటన్ లో జన్మించింది .. క్రికెటర్ హర్భజన్ కి ఓకే చెప్పాలా వద్దా అని సందేహం నాకు ఒకప్పుడు ఉందని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది .. తన కెరీర్ గురించి ఆందోళన పడ్డానని.. ఆదే సమయంలో క్రికెటర్స్ గురించి ఎన్నో రూమర్లు విన్నానని కూడా చెప్పుకొచ్చింది .. అలాగే గీత ఎన్నో బాలీవుడ్ సినిమాలు నటించింది .. ఈమె బాలీవుడ్ ఇమ్రాన్ అస్మితో పలు ముద్దు సన్నివేశాలు కూడా చేసింది .. ఇమ్రాన్ హష్మీ ది ట్రెయిన్ సినిమాలో ఆమెతో ప్రేమాయణం సాగించాడు. ఆమె అతనితో కలిసి సంగ్ దిల్ దియా హై చిత్రంలో కూడా పనిచేసింది. ఇక వీరిద్దరూ కలిసి బాలీవుడ్లో 10 సినిమాలకు పైన కలిసి నటించారు.